ర్యాగింగ్ కు నంద్యాల విద్యార్థి బలి
కర్నూలు: ర్యాగింగ్ భూతానికి మూడు నెలల పాటు చిత్రహింసలు అనుభవించిన విద్యార్థి ఒకతను గురువారం మృత్యుదేవత ఒడిలోకి చేరుకున్నాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన హరీష్ కుమార్ అనే విద్యార్థి గత మూడు నెలలుగా చికిత్స పొందుతూ మరణించాడు. అనంతపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ కుమార్ సీనియర్ల వేధింపులు భరించలేక ఆగస్టు 25వ తేదీన యాసిడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్పటి నుంచి అతను కోమాలోనే ఉన్నాడు. చికిత్స పొందుతూ మరణించాడు.
వివరాలు ఇలా ఉన్నాయి - హరీష్ కుమార్ ను పాలిటెక్నిక్ కశాశాలలో సీనియర్లు బట్టలిప్పేయించి, ఇతరత్రా తీవ్రంగా వేధించారు. దీంతో కలత చెందిన హరీష్ కుమార్ ఆగస్టు 22వ తేదీన నంద్యాలలోని ఇంటికి వచ్చాడు. 25వ తేదీన యాసిడ్ సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దాంతో అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను కోమాలోనే ఉన్నాడు. హరీష్ కుమార్ ను వేధించి ఘటనలో అనంత రెడ్డి అనే విద్యార్థిపై చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications