జనంతో పొంగుతున్న తుంగభద్ర తీరం
కర్నూలు: పుష్కరాల 4వ రోజు కూడా తుంగభద్ర తీరం జనంతో కిక్కిరిసిపోయింది. ప్రతిరోజు వేల సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. మహిళలు పుష్కరస్నానాల అనంతరం దీపాలు వెలిగించి నదీమతల్లికి నీరాజనాలు అర్పిస్తున్నారు. పితృదేవతలకు పిండప్రదానాలుచేసే వారితో నదీతీరం కోలాహలంగా మారింది. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరగటంతో అదనపు సౌకర్యాలకోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications