రాజు లేఖలో నిజం లేదు:ఐసిఎఐ

ఒక అకౌంటెంట్‌గా దీనిని ఏ మాత్రం అర్ధం చేసుకోలేనని, లేఖలో పేర్కొన్నట్లు రాత్రికి రాత్రే 5 వేల కోట్ల రూపాయలు సృష్టించటం సాధ్యం కాదని, అతని అకౌంటెంట్లు ఏమి చేస్తున్నట్లని జైన్ పేర్కొన్నారు. సత్యం కంప్యూటర్ వంటి పెద్ద సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఒక్క అకౌంటెంట్ వల్ల ఎటువంటి పని జరగదని,తాను ఒక అకౌంటెంట్‌గా దానిని తప్పుపడుతున్నట్లు జైన్ తెలిపారు.
రామలింగరాజు చెబుతున్న దాని ప్రకారం ఆయన ఒక్కడే ఇందులో ఉండే ఆవకాశం లేదని, చాలా మందికి ఇందులో సంబంధం ఉండవచ్చని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాలను దర్యాప్తు చేసిన మీదటే అనేక విషయాలు బయటకు వస్తాయని జైన్ వెల్లడించారు.సత్యం ఆడిటింగ్ వివాదంలో చార్టర్డ్ అకౌంటెంట్లు (సిఎ) తప్పు చేసినట్లు తేలితే ఎవరినైనా జీవిత కాలం నిషేధం విధించాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు.ఇందుకు సంబంధించి తాము అన్ని రకాలైన ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించామని తెలిపారు.












Click it and Unblock the Notifications