ప్రజారాజ్యం రాష్ట్ర కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ ఐదుగురు ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధానకార్యదర్శులతో కూడిన రాజకీయ వ్యవహారాల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా శనివారం మధ్యాహ్నం ఇక్కడ తెలిపారు. ఊపాధ్యక్షులుగా ఆంజనేయరెడ్డి, రెడ్డయ్య యాదవ్, పి.రాధాకృష్ణ, ఖలీల్ భాషా ఎంపికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా డా.మిత్రా, శోభానాగిరెడ్డి, వినయ్, వంగవీటి రాధా, కామినేని శ్రీనివాస్, అరుణతార, జల్లి సిద్ధయ్య వ్యవహరిస్తారు.
ఈ కమిటీలో ఎన్నికల ప్రణాళిక విభాగం ఛైర్మన్‌గా సీనియర్ నేత హరిరామజోగయ్యను, న్యాయ వ్యవహారాల ఛైర్మన్‌గా జంగయ్యనాయుడును నియమించినట్లు తెలిపారు. పీఎల్ మహేందర్, గోకా శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ, గౌతంలను అధికార ప్రతినిధులుగా నియమిస్తునట్లు ప్రకటించారు. మరి కొన్ని కమిటీలను ఈనెల్ 26 లోపు ప్రకటిస్తామని డాక్టర్ మిత్రా చెప్పారు.












Click it and Unblock the Notifications