ఒంగోలు: ఎస్సీ వర్గీకరణ జరిగితే కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలని అమలాపురం ఎంపీ హర్షకుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో మాలల రణభేరిలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏరోజు బిల్లు పెడితే ఆరోజే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇంతకాలం కాంగ్రెస్‌ను నమ్ముకున్న మాలలను కృష్ణ మాదిగతో కలిసి వై.ఎస్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.