భార్యా పిల్లలతో సహా ఆత్మహత్య
విశాఖపట్నం: విశాఖనగరంలో ఓ ఉద్యోగి భార్యాపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం కలిగించింది. రాంనగర్‌లో ఉంటూ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగం చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆఫీసులో వేధింపులే ఇందుకు కారణమని సూయిసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ ఆత్మహత్యపై అనేక అనుమానాలున్నాయి. మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో ఉండడం అనుమాలకు తావిస్తోంది. మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపిస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications