సత్యం రాజును ప్రశ్నిస్తున్న సిబిఐ

సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు, ఆయన సోదరులు, కంపెనీ మాజీ సీఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్, మాజీ ఆడిటర్లను మంగళవారం నుంచి వారంరోజులపాటు సీబీఐ విచారించనుంది. వారిని వారంపాటు న్యాయవాదుల సమక్షంలో విచారించేందుకు నాంపల్లి కోర్టు నిన్న సీబీఐకి అనుమతి మంజూరు చేసింది.
ప్రతిరోజూ ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజూ విచారణ జరుగుతుంది. అనంతరం సీబీఐ కార్యాలయానికి తరలిస్తారు. అక్కడగాని, దిల్‌కుశ్ అతిథిగృహంలో కాని వారిని విచారిస్తారు. తిరిగి సాయంత్రం వారిని కోర్టులో హాజరుపరుస్తారు.












Click it and Unblock the Notifications