హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తున్న స్పందన చూసి పవన్ కళ్యాణ్ మరింత కల్లు తాగుతారని తెలుగు దేశం అధ్యక్ష్యుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. నిన్న(శుక్రవారం) రాత్రి వివిధ ప్రాంతాల నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యులును, నేతలుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ ప్రసంగంలో పీఆర్పీని తీవ్రస్ధాయిలో దుయ్యపెట్టారు. చిరంజీవి ఏర్పాటు చేసిన పీఆర్పీ పార్టీ ప్రజలను గందరగోళపరచయానికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. దాని వల్లే ఏమీ ప్రయోజనం ఉండదని,ఏమీ చేయలేదని అన్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ ఒక గాలిబుడుగ లాంటి పార్టీ అని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లొంగక పార్టీ గెలుపుకు ఈ రెండు నెలలు కష్టపడిపనిచేయాలని ఆయన అన్నారు.