మేనిఫెస్టో: కాంగ్రెస్ వరాల వర్షం

ఎన్నికల ప్రణాళిక ముఖ్యాంశాలు-
- కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య
- రైతులకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు
- మహిళలకు పావలా వడ్డీ రుణాల కొనసాగింపు
- భద్రతాంధ్రప్రదేశ్ ఏర్పాటు
- గ్రామాల్లో ప్రతి ఇంటికీ కరెంట్ కనెక్షన్
- సమగ్ర పట్టణాభివృద్ధికి నిర్దిష్ట పథకాలు
- ప్రతి జిల్లాకో విశ్వవిద్యాలయం
- ప్రతి ఇంటికీ టాయిలెట్
- కేబుల్ టీవీ రంగానికి చేయూత
- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబాటు
- ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ స్కూళ్ల స్థాయిని నవోదయ స్థాయికి పెంచడం
- పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐల స్థాయి పెంపు
- ఎస్సీ, ఎస్టీ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇచ్చే సాయం రూ. 20 వేలకు పెంపు
తాము గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రణాళిక విడుదల అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆలోచన చేయడానికి కూడా ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం తమకు ఉందని ఆయన చెప్పారు. జలయజ్ఞం ద్వారా తాము ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు నీరు అందిస్తున్నామని, మిగతా ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టి, అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications