హైదరాబాద్: తాను ప్రజారాజ్యం అధినేత చిరంజీవితోనే ఉంటానని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా చెప్పారు. ప్రజారాజ్యం పార్టీకి తాను దూరమవుతున్నట్లు వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. టిక్కెట్ల కేటాయింపులో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. మూడవ ఫ్రంట్‌పై నమ్మకంలేకే తాము నాలుగవ ఫ్రంట్ వైపు మొగ్గు చూపుతున్నామని అన్నారు.
పార్టీ టిక్కెట్ల వ్యవహారంతో అసంతృప్తికి గురైన మిత్రా ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆయన నెల్లూరు సీటును అశించారు. అయితే ఆయనకు అది దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర నిరాశకు గురైనట్లు ప్రచారం జరిగింది.