పవన్ కు అస్వస్థత: ఆస్పత్రిలో చేరిక

Pawan Kalyan
హైదరాబాద్: యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మూడ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. అయినా తొలివిడత ప్రచారం ముగుస్తుండటంతో జ్వరంతోనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోమవారం రాత్రి పవన్‌ అంబర్‌ పేట రోడ్ షోలో ప్రసంగించి, రాంనగర్‌కు బయలుదేరిన సమయంలో అస్వస్థతకు గురయ్యారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కళ్లు తిరుగుతున్నాయని అనుచరులకు చెప్పి కూర్చుండిపోయారు. వెంటనే ఆయన్ని సికింద్రాబాద్‌ యశోదా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పరీక్షించిన వైద్యులు పవన్‌ ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. చిరంజీవి సతీమణి సురేఖ ఆసుపత్రికి వచ్చి పవన్‌ని పరామర్శించారు. సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి శ్రావణ్‌ కుమార్‌, అసెంబ్లీ అభ్యర్థి మేకల సారంగపాణి, కట్టెల శ్రీనివాసయాదవ్‌లూ పవన్‌ను పరామర్శించారు. విషయం తెలుసుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+