గుంటూరు: మొదటి విడత పోలింగ్ తోనే కాంగ్రెస్ ఓటమి ఖరారైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ బెంబేలెత్తి సంబంధం లేని ప్రకటనలు చేస్తున్నారని గుంటూరు జిల్లా రోడ్ షోలో విమర్శించారు. రెండో విడత పోలింగ్‌లోనూ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందని ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ రైలింజన్‌కు డ్రైవర్ లేడని ఎద్దేవా చేశారు. గెలవని పీఆర్పీకి ఓటు వేస్తే ఓట్లు మురిగిపోతాయన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కల్లును ఎక్సైజ్ శాఖ నుంచి సివిల్ సప్లయ్ కి మారుస్తామన్నారు. దళారీలు లేకుండా నగదు బదిలీ పథకం అమలు చేయటం, బెల్టు షాపులు మూసి వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.