మైక్రోసాఫ్ట్ విక్రయాల పతనం
శాన్ ఫ్రాన్సిస్కో: గత 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి మైక్రోసాఫ్ట్ త్రైమాసిక రెవెన్యూల్లో పతనం చవి చూసింది. గురువారం మైక్రోసాప్ట్ ఈ పతనాన్ని రుచి చూసింది. వ్యయంలో కోత వంటి చర్యలతో ఇన్వెస్టర్లు ఇప్పటికీ ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ ను ఆదరిస్తూనే ఉన్నారు. ఏడాది క్రితం త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే కంపెనీ రెవెన్యూ ఆరు శాతం 13.7 డాలర్లు పడిపోయిందని కంపెనీ వర్గాలు చెప్పాయి.
కొత్త కంప్యూటర్ల కొనుగోలును ఆలస్యం చేయడం లేదా వాయిదా వేసుకోవడం వంటి చర్యలతో వినియోగదారుల వ్యయం తగ్గింది. చరిత్రలోనే రెండో సారి మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం అమ్మకాలు తగ్గాయి. అయితే పరిస్థితి మారుతుందని మైక్రోసాఫ్ట్ వర్గాలు ఆశిస్తున్నాయి. మార్కెట్ కండీషన్స్ బలహీనపడడంతో రెవెన్యూ ఒత్తిళ్లను తట్టుకోవడానికి సంస్థ వ్యయంలో కోతకు సిద్ధపడిందని, దాంతో సంస్థ మెరుగ్గానే ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ క్రిస్ లిడ్డెల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో మూడు నెలల పాటు మార్కెట్ బలహీనంగానే ఉంటుందని అనుకుంటున్నట్లు లిడ్డెల్ చెప్పారు.












Click it and Unblock the Notifications