గుడిసెల తొలగింపుతో ఉద్రిక్తత
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని మహేంద్రహిల్స్ మరోమారు ఉద్రిక్తతకు నెలవైంది. గతంలో ఇక్కడ గుడిసెల తొలగింపు చేపట్టి తీవ్రన ప్రతిఘటన కారణంగా ఆగిన పోలీసులు బుధవారం ఉదయం తిరిగి గుడిసెల తొలగింపు చేపట్టారు. దీన్ని స్థానికులు ప్రతిఘటించటంతో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత పోలీసులు గుడిసెల తొలగింపునకు పూనుకున్నారు. వారిని ప్రతిఘటించేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. బుధవారం ఉదయం తిరిగి పోలీసులు ఆ పనికి పూనుకున్నారు.












Click it and Unblock the Notifications