అగ్రస్థానంలో అందాల భామ: అత్యధిక రెమ్యునరేషన్ ఈ హీరోయిన్‌కే!
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల ప్రాధాన్యతతో పాటు వారి రెమ్యునరేషన్లు కూడా భారీగా పెరుగుతున్నాయి.ఒకప్పుడు హీరోలతో పోలిస్తే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న భామలు తమ నటన, క్రేజ్ ఆధారంగా కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా అగ్రస్థానంలో నిలిచారు.
అగ్రస్థానంలో వారణాసి బ్యూటీ
గ్లోబల్ ఐకాన్ గా గుర్తింపు పొందిన ప్రియాంకా చోప్రా ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్టు 'వారణాసి' ప్రియాంక చోప్రా నటిస్తుండటంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం ఆమె ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు భారతీయ సినిమాల్లోనూ ప్రియాంక చోప్రా చూపిస్తున్న ఇంపాక్ట్ ఈ స్థాయి పారితోషకానికి ప్రధాన కారణం.

బాలీవుడ్ లీడింగ్ లేడీస్ వీరే..
ప్రియాంక చోప్రా తర్వాత బాలీవుడ్ నుంచి ఈ స్టార్ హీరోయిన్లు అత్యధిక రెమ్యునరేషన్లు పొందుతున్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.
దీపికా పదుకొణె: రాజసమైన పాత్రలతో పాటు పాన్-ఇండియా సినిమాల్లో నటిస్తున్న దీపికా పదుకొణె ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటూ రెండో స్థానంలో ఉన్నారు.
ఆలియా భట్: లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయిన ఆలియా భట్ ప్రస్తుతం రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటున్నారు.
కత్రినా కైఫ్: తన గ్లామర్, యాక్షన్ సీక్వెన్సులతో ఆకట్టుకునే కత్రినా కైఫ్ ఒక్కో ప్రాజెక్టుకు రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.
దక్షిణాదిలో టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న భామలు వీరే..
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్లకు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. సౌత్ ఇండియాలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు కూడా కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార: దశాబ్దాలుగా హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో ఆకట్టుకుంటున్న నయనతార ఒక్కో సినిమాకు రూ.10 నుంచి 12 కోట్లు తీసుకుంటున్నారు.
త్రిష: వరుస హిట్లతో మళ్లీ ఫుల్ జోష్ లో ఉన్న స్టార్ హీరోయిన్ త్రిష కూడా రూ.10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ పొందుతున్నారు.
సాయిపల్లవి: తన నేచురల్ యాక్టింగ్, డ్యాన్స్‌తో మెప్పించే సాయిపల్లవి.. భారీ పాన్-ఇండియా ప్రాజెక్టుల నేపథ్యంలో రూ.10 నుంచి 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కథానాయికా ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకాదరణ పెరగడం.. అదే సమయంలో భారతీయ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో హీరోయిన్ల మార్కెట్ పరిధి విస్తరించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్లు కూడా హీరోలకు పోటీగా భారీ పారితోషికాలు సాధిస్తూ పరిశ్రమలో కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్నారు.














Click it and Unblock the Notifications