ల్యాండ్ మ్యాప్ వివాదం వెనుక అసలేం జరుగుతోంది? కవిత పేరు మిస్సింగ్ వెనుక కథేంటి?
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న ఓ ల్యాండ్ మ్యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న భూముల యాజమాన్య హక్కులు, క్లస్టర్ల వివరాలతో కూడిన ఈ మ్యాప్ వెనుక పెద్ద రాజకీయమే నడుస్తోంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములు, ఆస్తుల వివరాలపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఈ మ్యాప్ తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ చిత్రంలో విస్మరించలేని, అత్యంత విస్మయానికి గురిచేస్తున్న అంశం ఒకటి ఉంది.
అదేమిటంటే, కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత పేరు ఆ మ్యాప్‌లో ఎక్కడా లేకపోవడమే! ప్రచారం జరుగుతున్న ఆ డిజిటల్ డేటా లేదా మ్యాప్‌ను గనక నమ్ముకుంటే, ఆ ప్రాంతంలో ఆమెకు కనీసం గజం భూమి కూడా లేదన్నది స్పష్టమవుతోంది. మరి ఈ అరుదైన మినహాయింపు ఏం చెబుతోంది? ఆమె గత కొంతకాలంగా లేవనెత్తుతున్న వాదనలకు ఇది బలమైన నిదర్శనంగా మారుతోందా? పార్టీలో, కుటుంబంలో ఆమెను చాలా కాలం క్రితమే పక్కన పెట్టారనేందుకు ఇదొక తిరుగులేని సాక్ష్యమా? సోషల్ మీడియా చర్చలు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏమిటి?

బీఆర్ఎస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, కేటీఆర్ తో వచ్చిన విభేదాలు, ఆ తర్వాత కవిత సొంతంగా 'తెలంగాణ రక్షణ సేన' పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా ఆమె క్రమంగా కుటుంబానికి, బీఆర్ఎస్ రాజకీయలకు దూరమయ్యారనే చర్చ నడుస్తుందో. ఈ ల్యాండ్ మ్యాప్ లో కవిత పేరు మాయం కావడం వెనుక-ఆమెను రాజకీయంగానే కాకుండా కుటుంబ ఆస్తుల పంపిణీ విషయంలోనూ చాలా కాలం క్రితమే పక్కన పెట్టారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేశకులు భావిస్తున్నారు.
రాజకీయాల్లో ఫామ్‌హౌస్‌లు లేదా భూకేంద్రాలు కేవలం రియల్ ఎస్టేట్ ఆస్తులు మాత్రమే కావు. అవి అధికార కేంద్రాలు, కుటుంబంలో ప్రాధాన్యతకు ప్రతీకలు. అలాంటిది, కుటుంబ ఆస్తుల చుట్టూ రగులుతున్న ఈ వివాదంలో ఒక కీలక నేత పేరు మాత్రం పూర్తిగా మాయం కావడం వెనుక ఆంతర్యం ఏమిటి? కుటుంబ ఆస్తులను, ఫామ్‌హౌస్ ల్యాండ్ రికార్డులను పొందపరిచేటప్పుడు కేవలం కేటీఆర్, ఇతర మగ వారికే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక పితృస్వామ్య ధోరణి ఉందా? లేక కవిత తీసుకున్న స్వతంత్ర రాజకీయ నిర్ణయాల వల్లే ఈ వ్యత్యాసమా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ సింగిల్ ల్యాండ్ మ్యాప్ తెలంగాణ రాజకీయాల్లోని కుటుంబ అంతర్గత విభేదాలను, అధికార పోరాటాలను మళ్లీ బహిర్గతం చేసింది.
ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన లోపమా? లేక కాలక్రమేణా ఆమెను క్రమపద్ధతిలో సైడ్‌లైన్ చేసిన విధానానికి ఇదొక దృశ్యరూపమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులకు దారితీస్తాయో చూడాలి!














Click it and Unblock the Notifications
