అమెరికాకు జూ.ఎన్టీఆర్
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు. టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన త్వరితగతిన కోలుకోవడం తెలిసిందే. వెన్నెముకకు తగిలిన దెబ్బల వల్ల మరి కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
వేసవిలో సేదదీరడానికి కొద్దిరోజులపాటు అమెరికాలో గడపాలని జూనియర్ ఎన్టీఆర్ భావించారు. పనిలో పనిగా అక్కడోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సన్నిహితులు సూచించారు. దీంతో త్వరలో అమెరికా వెళ్ళి ఓ 20 రోజులపాటు అక్కడే మకాం వేయనున్నట్టు తెలిసింది. తన పుట్టినరోజు తర్వాత అమెరికా వెళ్ళాలని జూనియర్ భావిస్తున్నారు.
ఈలోగా మరో కార్యక్రమానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మహాకూటమి విజయం సాధిస్తే.. భాగస్వామ్య పక్షాలు నిర్వహించే విజయోత్సవ సభలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని సమాచారం. అయితే, ఈ కార్యక్రమం ఉండేదీ లేనిదీ.. ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయితేగాని తేలదు.
-
ఆ వెబ్‌సైట్‌నే నమ్ముకున్న "ఇజ్రాయెల్" ప్రజలు.. ఏ పని అయినా ఆ తర్వాతే ?? -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications