చిరు పార్టీవన్నీ కలలే: రోజా

Roja
చెన్నై: చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తామని ఎక్కువ కలలు కన్నదని, అవన్నీ కలలే అని తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా అన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గల్లా అరుణకుమారిపై ఓడిపోయిన రోజా చెన్నై చేరుకున్నారు. ఐదేళ్లు తాను ప్రజల మధ్య ఉన్నానని, ప్రజలకు సేవ చేశానని ఆమె ఒక టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తనను ప్రజలు ఓడించలేదని, మిగతా పార్టీలన్నీ కలిసి ఓడించాయని ఆమె అన్నారు. తాను ప్రజల మధ్యనే ఉంటానని ఆమె చెప్పారు.

తమ పార్టీ ఓటమికి ప్రజారాజ్యం పార్టీయే కారణమని, ప్రజారాజ్యం వల్ల తాము 92 స్థానాల్లో ఓడిపోయామని ఆమె చెప్పారు. నామినేటెడ్ పదవులపై తనకు నమ్మకం లేదని, తాను ప్రజల మధ్యనే ఉంటానని, దాని ద్వారానే ప్రజాభిమానం పొందగలుగుతానని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+