మమత బెనర్జీకి వైయస్ లేఖ

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: ఆహార ధాన్యాల, ఎరువుల రవాణాకు తగినన్ని రైల్వే ర్యాక్స్‌ కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కోరారు.ఈ మేరకు ఆయన శనివారం మమతా బెనర్జీకి ఒక లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 153 రైల్వే ర్యాక్స్‌ మాత్రమే ఉన్నాయని అవసరాలకు తగ్గట్లుగా మరో 212 ర్యాక్స్‌ కేటాయించాలని దక్షిణ మధ్య రైల్వేకు ఆదేశాలివ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి జైరాం రమేష్ శనివారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. సచివాలయంలో జైరాం రమేష్ కు భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వాగతం చెప్పారు. ముఖ్యమంత్రితో రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులపై జైరాం రమేష్ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు తగిన కేంద్ర సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జైరాం రమేష్ ను కోరినట్లు చెబుతున్నారు.

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సచివాలయంలో అభినందించారు. భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు మరింత కష్టపడి చదవాలని ముఖ్యమంత్రి విద్యార్థులకు సూచించారు. కార్పొరేట్‌ విద్యాస్థంస్థలకు ధీటుగా సాంఘిక, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ప్రతిభకనబరచడం విద్యావ్యవస్థలో వచ్చిన మార్పుకు నిదర్శనమని సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+