లోక్‌సత్తా లేకుండా చేస్తాం
హైదరాబాద్ : లొక్‌సత్తా పార్టీని కనుమరుగు చేసేందుకు తెలుగు దేశం పార్టీ రంగంలోకి దిగాల్సిన అవసరం లేదని టీఎస్‌ఎన్‌వీ అధ్యక్షుడు పాలెం శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను పార్టీలో భాగమైన టీఎస్‌ఎన్‌వీనే తీసుకుంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో లొక్‌సత్తాకు పూర్తి స్ధాయిలో సమాధానం చెప్పేందుకు తెలుగు సాంకేతిక నిపుణుల విభాగాన్ని బలోపేతం చేస్తామని ఆయన మీడియాకు తెలిపారు.
పార్టీ కార్యాలయంలో జరిగిన టీఎస్‌ఎన్‌వీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల ఫలితాల విశ్లేషణతోపాటు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. విద్యావంతుల ఓట్లన్నీ లొక్‌సత్తా చీల్చిన మాట వాస్తవమేనని.. ఈ సారి అలాంటి అవకాశం లేకుండా పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే విధానపరమైన నిర్ణయాలతో ముందుకొస్తామన్నారు.












Click it and Unblock the Notifications