కేరళ గవర్నర్ కు బెదిరింపు కాల్
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆర్ ఎస్ గవాయ్ ని చంపుతామంటూ గల్ప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో రాజభవన్ వద్ద భద్రతను పెంచినట్లు సోమవారం పోలీసులు చెప్పారు. ఈ ఫోన్ కాల్ గత రాత్రి వచ్చింది. ఎల్డీఎఫ్ మంత్రివర్గ సిఫార్సును వ్యతిరేకిస్తూ గవర్నర్ గవాయ్ ఎస్ ఎన్సీ లేవిలిన్ ఆరోపణలో కేసులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పినరాయ్ విజయన్ పై సిపిఐ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి ఇచ్చిన వెంటనే గవర్నర్ కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి మలయాళంలో మాట్లాడాడు.












Click it and Unblock the Notifications