Nithiin: శృంగార నవలలు రాసే 'అలియాస్ రుక్మిణి': ఈసారి కాన్సెప్ట్ మామూలుగా లేదుగా!

Nithiin: స్టార్ హీరో నితిన్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. అప్పుడెప్పుడే వచ్చిన 'భీష్మ' చిత్రం తర్వాత ఇప్పటివరకు మరో హిట్ కొట్టకపోవడం గమనార్హం. నితిన్ ప్రస్తుతం సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో నితిన్ నేచురల్ స్టార్ నానితో చేతులు కలిపాడు. నాని నిర్మాతగా తన సొంత బ్యానర్ పై సమర్పిస్తుండగా.. నితిన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సోమవారం(ఆగస్టు 3) సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను సినీ మేకర్స్ విడుదల చేశారు. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'అలియాస్ రుక్మిణి' అనే డిఫరెంట్ టైటిల్ ను ఖరారు చేశారు.

ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'హృదయం మురళి'
ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'హృదయం మురళి'

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో నాని, దర్శకుడు మురళీకాంత్ మధ్య జరిగే సరదా సంభాషణతో ప్రారంభమవుతుంది. కథ గురించి నాని అడగగా.. ఇది ఓ కృష్ణుడి కథ అని డైరెక్టర్ చెబుతాడు. అయితే తెరపై 'రుక్మిణీ' అనే రచయిత పేరుతో రాసిన 'గరం గోపాల్', 'ఆమెకు ఆమె అంటే ఇష్టం', 'వ్రతం వెంకన్న' వంటి విభిన్నమైన శృంగార/ప్రేమ నవలలు కనిపిస్తాయి.

Nithiin and Nani Team Up for Alias Rukmini Unique Title Glimpse Released Directed by Muralikanth

దర్శకుడి వివరణతో అయోమయానికి గురైన నాని.. "ఇది కృష్ణుడి కథ అని చెప్పారు కదా.. మరి ఈ నవలలు రాసిన రుక్మిణి ఎవరు?" అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా వీడియో చివరలో హీరో నితిన్ ఎంట్రీ ఇస్తారు. ఓ ఆఫీసు వాతావరణంలో, కళ్లద్దాలు సరిచేసుకుంటూ 'కృష్ణ' అనే క్యారెక్టర్ లో కనిపిస్తూ.. "నా భార్య" అని నితిన్ చెప్పే సమాధానంతో గ్లింప్స్ ముగుస్తుంది. ఈ ఒక్క సన్నివేశంతో కథపై ప్రేక్షకదేవుళ్ళలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. శృంగార నవలలు రాసే నితిన్.. తన కలం పేరు రుక్మిణీ అని పెట్టుకుని పాఠకులకు దగ్గరవుతాడని తెలుస్తోంది. రుక్మిణీ ఎవరంటే తన భార్య అని చెబుతుంటాడు.. మరి నిజంగానే రుక్మిణీ తన భార్యనా లేదంటే ఇంకేదైనా ట్విస్ట్ ఉందా అనే పాయింట్ తో మంచి ఉత్కంఠను పెంచారు.

చాలాసార్లు ఆఫర్ వచ్చింది.. బిగ్ బాస్‌కు మళ్లీ 'నో’ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్!
చాలాసార్లు ఆఫర్ వచ్చింది.. బిగ్ బాస్‌కు మళ్లీ 'నో’ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్!

టాప్ టెక్నికల్ బృందంతో ప్రీ-ప్రొడక్షన్ పనులు!
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటులు, ఇతర పూర్తి కథాంశ వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది. ఈ సాంకేతిక నిపుణుల విషయానికొస్తే... ఈ సినిమాకు జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సృజన అడుసుమిల్లి ఎడిటర్ గా, విజయ్ బల్గానిన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+