ప్రజారాజ్యం పార్టీ మిత్రా గుడ్ బై?

రాజీనామా అంటూ కలకలం సృష్టించవద్దని కూడా చిరంజీవి మిత్రాతో అన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మిత్రా చిరంజీవికి అనేక లేఖలు రాశారు. కొన్ని లేఖలను స్వయంగా చిరంజీవికి అందజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా చిరంజీవిలో మార్పు రాకపోవడంతో మిత్రా చాలా రోజులుగా తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాలపై జరిగిన సమీక్షా సమావేశాలపై కూడా మిత్రా సంతృప్తిగా లేరు. ఈవీఎంలు, పార్టీ గుర్తు (రైలింజన్)లో గందరగోళం కారణంగానే ఓడిపోయామన్న సూత్రీకరణ తప్ప ఓటమికి అసలు కారణాలేమిటో అన్వేషించలేకపోయారని ఆయన తన సహచరులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications