ఎస్సీల వర్గీకరణకు చట్టబద్దత: ఎంపి
వరంగల్: పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీలకు వర్గీకరణకు చట్టబద్దత లభిస్తుందని వరంగల్ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకే చట్టబద్ధతపై ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ ప్రక్రియ పూర్తవుతుందని, ఎబిసిడిలుగా వర్గీకరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులను దళితలుగా గుర్తించే విధంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చట్టం రూపొందే అవకాశం ఉందని రాజయ్య వెల్లడించారు.












Click it and Unblock the Notifications