ముంబై: శివసేన అధినేత బాల్ థాకరేను సోమవారంనాడు బాంద్రా శివారులోని ఆస్పత్రిలో చేర్చారు. 82 ఏళ్ల థాకరేను లీలావతి ఆస్పత్రిలో చేర్చినట్లు శివసేన వర్గాలు చెప్పాయి. అయితే ఇది మామూలు పరీక్షల నిమిత్తమేనని ఆ వర్గాలంటున్నాయి. బాల్ థాకరే ఆరోగ్యంపై ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ఆ వర్గాలు చెప్పాయి. శ్వాసకోశ సంబంధమైన సమస్య తలెత్తడంతో థాకరే గత నెల ఆస్పత్రిలో చేరారు.