తడిసి ముద్దవుతున్న ముంబై
ముంబై: భారీ వర్షాలతో ముంబై తడిసి ముద్దవుతోంది. మంగళవారం రాత్రి ముంబైలో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నగరంలో సాధారణ జన జీవితం దెబ్బ తింది. దాదర్, హింద్ మత, చెంబూరు, పరేల్, సియోన్ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానమై రోడ్లు కూడా జలమయం కావడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది.
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు పాక్షికంగా విఘాతం కలిగింది. వెలుతురు పెరిగిన తర్వతా విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ముంబైలో మరిన్ని వర్షపు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులంటున్నారు.












Click it and Unblock the Notifications