బెజవాడలో బిటెక్ విద్యార్థి ఆత్మహత్య
విజయవాడ: విజయవాడలో గురువారం ఒక బిటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను విజయవాడలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శివప్రసాద్ అనే ఆ విద్యార్థి కడపకు చెందినవాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు.
సెలవులకు స్వస్థలం వెళ్లిన శివప్రసాద్ ఈ నెల 5వ తేదీన తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం మహానాడు రోడ్డులోని హాస్టల్లో టిఫిన్ చూసి తన గదికి వెళ్లాడు. ఆ తర్వాత ఎంతకీ తలుపులు తీయకపోవడంతో తలుపు తీసి చూస్తే ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప నుంచి బంధువులు వస్తే ఆత్మహత్యకు కారణాలు తెలియవచ్చునని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications