నా బాధలన్నీ బాబుకు చెప్పా: తలసాని

Talasani Srinivas Yadav
హైదరాబాద్‌: ఏ విషయమైనా తాను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనే చర్చిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం తనకు కన్న తల్లిలాంటిదని, తాను పార్టీకి 22 ఏళ్లు సేవ చేశానని, తానేం చేసినా పార్టీ బలోపేతానికేనని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. తాను కాస్తా ఎక్కువగా చేసిన మాట నిజమేనని ఆయన అన్నారు.

నిన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ పార్టీ నేతల సమావేశానికి సమాచారం లేకపోవడం వల్ల హాజరు కాలేదని, ఈ రోజు సమాచారం ఉంది కాబట్టి వచ్చానని ఆయన చెప్పారు. తెలంగాణవాదానికి బలం ఉందా లేదా అనే విషయంపై తాను గ్రేటర్ హైదరాబాదులో చేయిస్తున్న సర్వేను నిలిపేశానని, చంద్రబాబే ఆ సర్వే చేయిస్తానని చెప్పారని, దాని వల్ల తాను ఆపేశానని ఆయన చెప్పారు. చంద్రబాబుతో అన్ని విషయాలు చెప్పానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. తన బాధలన్నీ చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. దీన్ని బట్టి తలసాని శ్రీనివాస యాదవ్ రాజీకి వచ్చినట్లే కనిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+