దారుణంగా వైయస్: చంద్రబాబు

ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, బాధితుల నుంచి ఫిర్యాదు లేకుండా రామారావుపై అత్యాచారం, హత్యానేరాల కింద కేసు నమోదు చేశారని, ఇంతకన్నా దారుణముంటుందా? అని కేసు విషయాన్ని గవర్నరు దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లి డేవిడ్‌రాజు, 'సాక్షి' పత్రిక విలేకరి శ్యామలరావు, మరికొంతమంది కలిసి రామారావుపై అత్యాచారం, హత్య వదంతులు పుట్టించారని తెలిపారు. ఎవరో తనకు చెప్పారంటూ పిల్లి డేవిడ్‌రాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారంటూ రామారావుపై పెట్టిన కేసు పూర్వాపరాలు, అనంతరం జరిగిన పరిణామాలను గవర్నరుకు వివరించారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 'ఆపరేషన్ ఆకర్ష' పేరుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని, వినకపోతే వేధింపులకు గురిచేస్తున్నారని, అప్పటికీ లొంగకపోతే ఇలా తప్పుడు కేసులు బనాయించి మానసికంగా బాధిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. రామారావు కేసు విషయంలో ముఖ్యమంత్రి పేషీ నుంచే అపాయింట్‌మెంట్స్ ఇచ్చి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications