ర్యాంగింగ్ పై సర్కారు సీరియస్
హైదరాబాద్: ర్యాగింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ర్యాగింగ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రమాకాంత్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే యజమానులను అరెస్టు చేయడానికి కూడా వెనకాడమని ఆయన హెచ్చరించారు. జూబ్లీహాల్‌లో ఏర్పాటు చేసిన ర్యాగింగ్ సదస్సులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి, డీజీపీ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కళాశాలల్లో తప్పనిసరిగా యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో ర్యాగింగ్ నిరోధానికి పాఠ్యంశాన్ని ప్రవేశపెట్టాలని కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications
