అసంతృప్తి నిజమే:చిరంజీవి
తిరుపతి: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన అనంతరం ప్రజారాజ్యం పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రకటించారు. రెండురోజుల తిరుపతి పర్యటనలో భాగంగా ఇక్కడి మీడియాతో చిరు మాట్లాడారు. పార్టీలో అసమ్మతి ఉన్న మాట వాస్తవమేనని చిరంజీవి ఈ సందర్భంగా అంగీకరించారు. గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిపేందుకు 150 మంది అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications