ముంబాయి: బీఎస్ ఈ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ప్రారంభం అయింది. క్రితం రోజు 129 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఆరంభంలోనే 62పాయింట్లను లాభం పోందగా, నిఫ్టి 21 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 188.84 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 15,251.33 పాయింట్ల వద్ద, నిఫ్టి 54.80 పాయింట్లు లాభం పొంది 4523.90 వద్ద ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇన్ ఫ్రా, ఒఎన్ జీ కార్పోరేషన్, టాటా స్టీల్, టాటా మోటర్స్, ఇన్పోసిస్ లు లాభాల్లో కొనసాగుతున్నాయి.