చిరుపై సందేహం: టిడిపిలోకి గౌడ్?

కాంగ్రెసును ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయాలని దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో వాదిస్తూ వచ్చారు. అయితే దీనికి చిరంజీవి అంగీకరించలేదు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు సమ దూరం పాటించాలనే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నారు. అధికార పార్టీని, ప్రధాన ప్రతిపక్షాన్ని ఒకే గాటన కట్టడం సరి కాదని దేవేందర్ గౌడ్ వాదిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం పార్టీ బలోపేతమవుతుందనే నమ్మకం కూడా లేకుండా పోయింది. దానికి తోడు, అవసరం వస్తే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసుతో కలిసి పనిచేస్తుందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. కాంగ్రెసుకు బద్దవ్యతిరేకి అయిన దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాలు రుచించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన సొంత గూటికి చేరుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications