హైదరాబాద్: హైదరాబాదు నగరంలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. జెడ్డా నుంచి నగరానికి వచ్చిన వ్యక్తికి స్వైన్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతన్ని హైదరాబాదులోని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 72 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ కేసుల నిర్ధారణకు ప్రభుత్వం విస్తృతమైన చర్యలు తీసుకుంది.