ముంబై దాడులు: వ్యాపారి అరెస్టు

ముంబై దాడుల నిందితులకు సంబంధించి భారత్ జూలై 11వ తేదీన పాకిస్తాన్ కు ఒక నివేదికను అందజేసింది. అందులో జమీల్ ఖాన్ అనే పేరు ఉంది. ఆ జమీల్ ఖానే జమీల్ అహ్మద్ అయి ఉంటాడని భావిస్తున్నారు. ముంబై దాడుల కేసులో పాకిస్తాన్ అరెస్టు చేసిన ఐదుగురిలో ఒక్కడైన షాహిద్ జమీల్ రియాజ్ కు జమీల్ అహ్మద్ 10 నుంచి 15 లక్షల రూపాయలు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. జమీల్ అహ్మద్ రియాజ్ కు పంపిన డబ్బులతో యమా మోటార్ ఇంజన్ కొన్నారు. దీన్నే ముంబైలో స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుతోనే లైఫ్ జాకెట్లను, పడవలను కొనుగోలు చేశారు.












Click it and Unblock the Notifications