ఐదేళ్ల తర్వాతే రాజకీయం: రాజశేఖర్

గత ఎన్నికలకు ముందు రాజశేఖర్ తన సతీమణి జీవితతో కలిసి కాంగ్రెసు పార్టీలో చేరారు. జీవిత మహిళా కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాము పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తామని జీవిత పదే పదే చెప్పారు. కానీ వారిద్దరికీ కాంగ్రెసు ఏ విధమైన బాధ్యతలూ ఇవ్వలేదు. ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వలేదు. ఆలస్యంగా పార్టీలో కాలు పెట్టిన జయసుధకు మాత్రం శాసనసభ టికెట్ ఇచ్చారు. ఆమె సికింద్రాబాదు నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. పార్టీ నుంచి సరైన గుర్తింపు లేదనే బాధ రాజశేఖర్ దంపతుల్లో ఉన్నట్లుంది.












Click it and Unblock the Notifications