తెరాసపై రాములమ్మ మండిపాటు

పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ బయలుదేరుతున్న సమయంలో హైదరాబాదులో అత్యవసర సమావేశాలున్నాయని, తప్పకుండా రావాలని కబురు పంపారని, తీరా అక్కకు వెళ్లాక తనను ఎవరూ సంప్రదించలేదని ఆమె అన్నారు. హడావిడిగా పిలిపించి ఒక్కరు కూడా తనతో మాట్లాడలేదని ఆమె అన్నారు. తనను పార్టీ నుంచి పంపించేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.
కాగా, విజయశాంతి ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. దాంతో ఆమె కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వదంతులు వ్యాపించాయి. ఆ వార్తలను విజయశాంతి ఖండించనూ లేదు, సమర్థించనూ లేదు. శనివారం ఆమెతో తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications