ఉద్ధంపూర్: జమ్మూ కాశ్మీర్ లోని రీసి జిల్లాలో భారత భద్రతా బలగాల చేతిలో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ మిలిటెంట్ హతమయ్యాడు. తమకు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు మహోర్ తెహిసీల్ లోని లరద్ ప్రాంతాన్ని సోమవారం ఉదయం చుట్టుముట్టి సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా మిలిటెంట్లు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు.
భద్రతా బలగాలు ఎదురు కాల్పులు కొనసాగించాయి. ఈ ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ జిల్లా కమాండర్ అల్తాఫ్ హుస్సేన్ మరణించాడు. మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య చాలా సేపు ఎదురు కాల్పులు జరిగాయి.