సిఎం నిజంగా మిస్సింగే: రోశయ్య

అయితే..హెలికాప్టర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో సురక్షితంగా ల్యాండయినట్లు సమచారం అందిందని, సిఎం సేఫ్ గానే ఉండిఉంటారని రోశయ్య చెప్పారు. కాని..దట్టమైన అడవి..దానికి తోడు కుండపోత వర్షం..హెలికాప్టర్ ల్యాండయిన ప్రాంతాన్ని కనుక్కొవడం కష్టంగా మారిందని ఆయన వెల్లడించారు. చీకటి పడేలోగా సిఎం ఆచూకీ కనుగొనాలని రోశయ్య అధికారులను ఆదేశించారు. అడవి చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో సిఎం జాడ కనుగొనమని అధికారులకు రోశయ్య సూచించారు. సిఎం ఆచూకి కోసం నాలుగు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరుకు భారీ సంఖ్యలో పోలీసుల బలగాలు చేరాయి.












Click it and Unblock the Notifications