వైయస్ కు అద్వానీ నివాళి

మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వైయస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సిపిఎం నాయకుడు బివి రాఘవులు, తదితర పార్టీల నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. వైయస్ భౌతిక కాయం పులివెందులకు తీసుకుని వెళ్లడానికి బేగంపేట విమానాశ్రయానికి చేరుతోంది. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాగ్, తదితరులు ఇడుపులపాయకు బయలుదేరుతున్నారు.
వైయస్ కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాదు నుంచి ఇడుపులపాయకు బయలుదేరారు. ఇడుపులపాయకు ఎనిమిది హెలికాప్టర్లు వెళ్తున్నాయి. వైయస్ భౌతిక కాయాన్ని ప్రత్యేకమైన శవపేటికలో ఉంచి సైనిక హెలికాప్టర్ లో బేగంపేట విమానాశ్రయం నుంచి పులివెందులకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications