Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ గురించి అడుగొద్దు: డిఎస్

D Srinivasa Rao
హైదరాబాద్: వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో తనను ఏమీ అడగవద్దని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి పదవి జగన్ కు ఇవ్వాలని అడుగుతుంటే వాళ్లనే అడగండని, తనను అడగవద్దని ఆయన అన్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ పై సీనియర్ పార్టీ నాయకులు కె. కేశవరావు, జి. వెంకటస్వామి, తదితరులు చేస్తున్న వ్యాఖ్యలపై తనను అడగవద్దని, వారినే అడగాలని ఆయన అన్నారు. వారు చెప్పనప్పుడు తాను ఎలా చెబుతానని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మాట్లాడినవారు తనకన్నా సీనియర్లని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెంది నెల రోజులు కూడా కాలేదని, తాను ఆ బాధ నుంచి ఇంకా బయట పడలేదని, ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి ఎవరవుతారనే న్యూసెన్స్ ఏమిటని ఆయన అన్నారు. జగన్ ను సిఎం చేయాలని పార్టీ నాయకులు కొంత మంది డిమాండ్ చేస్తున్నారని మీడియా ప్రతినిధులంటే వాళ్లేమైనా మాట్లాడనీయండి గానీ తాను మాత్రం మాట్లాడే స్థితిలో లేనని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రిగా రోశయ్యనే కొనసాగిస్తుందా, జగన్ ను ముఖ్యమంత్రిగా చేస్తుందా అనేది తనకు అవసరం లేని విషయమని, ఎవరు ముఖ్యమంత్రి అయినా వారితో తాను ఈ పదవిలో ఉన్నంత వరకు కలిసి పని చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే విషయం పార్టీ అధిష్ఠానం వద్ద ఉందని, అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఆ విషయంలో తాను ఏమీ మాట్లడబోనని ఆయన అన్నారు. ఆ విషయాలు తనను అడగవద్దని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా రోశయ్య సమర్ధుదనేది వేరు, జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది వేరు అని, రెండు వేర్వేరు విషయాలని ఆయన అన్నారు. రోశయ్య పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పార్టీ అధిష్ఠానం చెప్పలేదు కాబట్టి జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ రావడం సహజమని ఆయన అన్నారు. రోశయ్య సమర్థుడని అనకపోతే అసమర్థుడని ఎలా అంటామని ఆయన ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డికి రోశయ్య కుడి భుజంగా ఉన్నారని, 20 ఏళ్లకు పైగా పాలనానుభవం ఉందని, పాలనా యంత్రాంగాన్ని నడపడంలో రోశయ్య అసమర్థుడు ఎలా అవుతారని ఆయన అన్నారు.

జగన్ ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ పై, నాయకత్వ మార్పు విషయంలో జరుగుతున్న వ్యవహారాలపై తనను ఏమీ అడగవద్దని అంటూ ఒక సందర్భంలో డోంటాక్ అని విరుచుకుపడ్డారు. మీరేదో అడుగుతారు, మేమేదో చెప్తాం, మరేదో రాస్తారు,ఇదంతా ఎందుకని ఆయన అన్నారు. నాయకత్వ మార్పు విషయంలో మీడియా అయోమయానికి గురై తమను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తోందని, తమకు ఏ విధమైన అయోమయం లేదని, తమకు పూర్తి స్పష్టత ఉందని ఆయన అన్నారు. నాయకత్వ మార్పు విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఇదే విషయాన్ని పార్టీ నాయకులంతా చెబుతున్నారని, పార్టీ కలిసికట్టుగా ఉందని, విభేదాలు లేవని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+