సారథి స్టూడియోస్ డైరెక్టర్ హత్య

Murder
హైదరాబాద్: హైదరాబాదులోని అమీర్ పేట సమీపంలో గల సారథి స్టూడియోస్ డైరెక్టర్ బాబూరావు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి ఆయనను హత్య చేశారు. అయితే ఎవరు హత్య చేసి ఉంటారనేది తెలియడం లేదు. ఒకరి కన్నా ఎక్కువ మందే ఆయనను హత్య చేసి ఉంటారని, బాగా తెలిసిన వారే దీనికి ఒడి గట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. భూతగాదాలే హత్యకు కారణమైన ఉండవచ్చునని భావిస్తున్నారు.

రాత్రి 9 గంటలకు వాకింగ్ కు వెళ్లిన బాబూరావు 11 గంటలు దాటినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సారథి స్టూడియోస్ వెతికారు. స్టూడియోలో రక్తం మడుగులో పడి ఉన్న బాబూరావును ఆయన కుమారుడు శరత్ చూసి ఇమేజ్ అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబూరావు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు దాంతో పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అర్థరాత్రి వరకు స్టూడియో షూటింగులతో రద్దీ ఉంటుంది. అటువంటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు లోనికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. కత్తులతో దాడి చేసి పారిపోతుంటే సిబ్బంది చూసే అవకాశం ఉందని, అందువల్ల బాగా తెలిసినవారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+