విజయవాడ: కృష్ణా నది చివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఎగుర వేశారు. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి మట్టం 11.8 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 4.3 లక్షల క్యూసెక్కులు ఉండగా అధికారులు 3.86 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం అంత ఎక్కువగా లేనందువల్ల భయపడాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు.