గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సహాయానికే తొలి ప్రాధాన్యం: డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
కర్నూలు/ గుంటూరు: ప్రస్తుత పరిస్థితిలో వరద బాధితులకు సహాయం అందించడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. కర్నూలులో ముఖ్యమంత్రి కె.రోశయ్య కాన్వాయ్ పై ఉద్దేశపూర్వకంగానే రాళ్లు రువ్వినట్లు భావిస్తున్నానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎంత సమర్థంగా సహాయక చర్యలు అందించినా అందరినీ సంతృప్తిపరచడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన అన్నారు. వరద బీభత్సం మానవ తప్పిదమేననేది సాంకేతికపరమైందని ఆయన అన్నారు.

వరదల వల్ల అపార నష్టం సంభవించినప్పటికీ ప్రాణ నష్టాన్ని నివారించడంలో అధికారులు సమర్థంగా పని చేశారని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. గుంటూరు జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయక చర్యల్లో అధికారుల పని తీరు బాగుందని ఆయన ప్రశంసించారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని సహాయక చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు సాయపడిన వైయస్ రాజశేఖర రెడ్డి దేశంలోనే నెంబర్ వన్ సిఎం అని ఆయన ప్రశంసించారు.

అంతకు ముందు ఆయన కర్నూలు, నంద్యాల వరద బాధితులను పరామర్శించారు. నంద్యాల నుంచి గుంటూరు జిల్లాకు బయలుదేరే ముందు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హెలిపాడ్ లో కూరుకుపోయింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హెలిపాడ్ తడిసిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X