ఇరాక్: బాగ్దాద్ నగరం బాంబు పేలుళ్లతో మార్మోగింది. ఇరాక్ న్యాయశాఖ, కుర్దిష్ పార్టీ కార్యాలయాల వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో సుమారు 25మంది మృతి చెందగా, 45మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది పరిస్థితి సమీక్షిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.