జైల్ భరో: తెరాస నేతల అరెస్టు

ఇదిలా వుంటే, కరీంనగర్ జిల్లాలోని ఆర్డీవో కార్యాలయంపై తెరాస కార్యకర్తలు నల్లజెండా ఎగురవేశారు. రామగుండంలో జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టిన శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ ను పోలీసులు అరెస్టు చేశారు. భూపాలపల్లి సింగరేణి డిఎం కార్యాలయాన్ని మధుసూదనాచారి నేతృత్వంలో తెరాస కార్యకర్తలు ముట్టడించారు. మహబూబ్ నగర్ లో తెరాస శాసనసభ్యుడు కె. తారక రామారావుకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మెదక్ జిల్లా సిద్ధిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస జైల్ భరో కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. తెరాస కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు స్వల్బంగా లాఠీచార్జీ చేశారు శాసనసభ్యుడు హరీష్ రావు సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లోనూ తెరాస జైల్ భరో కార్యక్రమం నిర్వహించింది.












Click it and Unblock the Notifications