కొండా సురేఖపై టిడిపి నేతల ధ్వజం

సురేఖ వ్యాఖ్యలు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉన్నాయని తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే సత్తా లేక సురేఖ తమపై, తమ నాయకుడు చంద్రబాబుపై సురేఖ విమర్శలు చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సురేఖ భగవంతుడ్ని ఒక్కడ్నే వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ ను ఎన్నుకునే బలం లేక సురేఖ తమపై మండిపడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా తమకేమీ అవసరం లేదని, ప్రజాసమస్యలపై పోరాటమే తమకు ముఖ్యమని మరో తెలుగుదేశం నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాంగ్రెసు పార్టీలో యాజమాన్య హక్కుల కోసం పోరాటం జరుగుతోందని మరో తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాంగ్రెసును ఇడుపులపాయ కాంగ్రెసుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications