కనకదుర్గ గుడి వద్ద లైంగిక వేధింపులు

ఇటీవల ఒక సెక్యూరిటీగార్డు భవానీదీక్ష స్వీకరించి విధులకు రాగా ఆ భవానీపై అసభ్యకరంగా మాట్లాడ డంతో అతను విధుల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. ఆలయంలోని సెక్యూరిటీ కార్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానిక సిబ్బంది ఆలయ ఈవో దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో ఈవో ఓపీడీఎస్ కార్యాలయాన్ని ఖాళీ చేయించాలని ఆదేశించడంతో సంబంధిత అధికారులు కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. ఆలయంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టే క్యూల వద్ద, కేశఖండన శాల వద్ద, ఘాట్‌రోడ్డులో కారు నిలుపుదల స్థలం వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వీరిపై ఆలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆలయ ఉన్నతాధికారులు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications