హైదరాబాద్ : నగరంలోని డీఆర్‌డీఎల్ కూడలిలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీగార్డ్ మల్లేష్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. నీటిపారుదల శాఖలో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మల్లేష్ గత ఆరునెలల కాలంగా ఏటీఎంలో సెక్యూరిటగార్డుగా పనిచేస్తున్నాడు. ఆగంతకులు మల్లేష్‌ను తాడుతో ఉరిబిగించి హత్య చేశారు. ఎటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వ్యక్తులు మల్లేష్ రక్తపుమడుగలో ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.