ఉత్తరాంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష

Andhra University
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అన్ని రంగాలలో వెనుకబడి ఉందని, అందువల్ల ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 'జై ఉత్తరాంధ్ర' కన్వీనర్‌ జేటీ రామారావు డిమాండ్‌ చేశారు. విశాఖలోని జీవీఎంసీ ఎదురుగాగల గాంధీవిగ్రహం వద్ద ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాయకుల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతున్నదని, ఇక్కడ ఉపాధి లేక ఈ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు లక్షలాది మంది కూలీలు వలస పోవడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. విశాఖపట్నంలో పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులుకు అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు, ఖమ్మం జిల్లాలో భద్రాచలం డివిజన్‌ను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయలన్నారు. వై ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి భారీ ఎత్తును నిధులు మంజూరు చేసి పనులు చేపట్టారని, సహజ వనరులు పుష్కలంగా వున్న ఉత్తరాంధ్రపై చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రామారావు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించి అభివృద్ధి చేస్తే అప్పుడు ప్రత్యేక తెలంగాణపై తాము అభ్యంతరం చెప్పబోమని అన్నారు.

ప్రజా స్పందన ప్రతినిధి సీఎస్‌ రావు, తాడి మనోహర్‌, ఎం.సింహచలం, ఎస్‌.సుధాకర్‌, జీవీఎంసీ ఐఎన్‌టీ యూసీ అధ్యక్షుడు చొక్కా చిన్న అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా సుమారు గంటపాటు దీక్ష చేసిన అనంతరం టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ను కరీంనగర్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్టు సమా చారం రావడంతో తాను నిరసన దీక్షను విరమించుకున్నట్టు రామారావు ప్రకటించి, శిబిరాన్ని తొలగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+